ETV Bharat / city

AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రోడ్లన్నీజలమయం - ఏపీ తాజా వార్తలు

AP RAINS
AP RAINS
author img

By

Published : Sep 3, 2021, 11:51 AM IST

Updated : Sep 3, 2021, 9:11 PM IST

12:27 September 03

వెల్దుర్తి మండలంలో ఉప్పలవాగు దాటుతూ వ్యక్తి మృతి

  • గుంటూరు: వెల్దుర్తి మండలంలో ఉప్పలవాగు దాటుతూ వ్యక్తి మృతి
  • శ్రీరాంపురంతండా-బోదలవీడు మధ్య ఉప్పలవాగులో శ్రీను(40) మృతి
  • వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందిన తమావతు శ్రీను

11:53 September 03

నందిగామ నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి.. రాకపోకలకు అంతరాయం

  • కృష్ణా: నందిగామ నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి
  • వాగుల ఉద్ధృతికి పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం
  • కృష్ణా: చందాపురం వద్ద నల్లవాగు ఉద్ధృతి
  • నందిగామ-చందర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం
  • అడవిరావులపాడు వద్ద వాగు ఉద్ధృతికి రాకపోకలకు అంతరాయం
  • కృష్ణా: అనాసాగరం వద్ద కూచి వాగు ఉద్ధృతి
  • నందిగామ-పెనుగంచిప్రోలు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం
  • కృష్ణా: కంచికచర్లలో లక్ష్మయ్య వాగు ఉద్ధృతికి రాకపోకలకు అంతరాయం

11:52 September 03

పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

  • ప.గో.: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద
  • కాఫర్ డ్యామ్‌ వద్ద 30.6 మీటర్లకు చేరిన గోదావరి నీటిమట్టం
  • 48 గేట్ల ద్వారా ప్రవహిస్తున్న 2,05,126 క్యూసెక్కుల వరద

11:52 September 03

అనంతపురం చిన్నపల్లిలో కోతకు గురైన రహదారి

  • అనంతపురం: చిన్నపల్లి మండలంలో కోతకు గురైన రహదారి
  • వరద ప్రవాహానికి కోతకు గురైన కదిరి-పులివెందుల రహదారి
  • అనంతపురం: ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు, ఇద్దరు మృతి

11:49 September 03

నెమలి-కొణిజర్ల మధ్య వాగు ఉద్ధృతి

  • కృష్ణా: గంపలగూడెం మండలం నెమలి-కొణిజర్ల మధ్య వాగు ఉద్ధృతి
  • వాగు ఉద్ధృతికి తిరువూరు-మధిర ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలు

11:48 September 03

అనంతపురం జిల్లాలో వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా తలుపుల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి చిన్నపల్లి , కదిరి పులివెందుల ప్రధాన రహదారి ఒదులపల్లి వద్ద వరద నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు కదిరి పట్టణంలోని మూర్తిపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా కుమారుడిగా గుర్తించారు. ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో కదిరి పులివెందుల మధ్య రాకపోకలు స్తంభించాయి. కదిరి గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి ఇతర అధికారులు, గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

11:48 September 03

కర్నూలులో భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల వాగులు ఉప్పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. చాగలమరి మండలంలోని కలుగోట్లపల్లి, బ్రాహ్మణపల్లె మధ్యన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తుడటంతో పోలీసులు రాకపోకలను అడ్డుకున్నారు. వర్షాల కారణంగా మినుము, మొక్కజొన్న పంటలు వందలాది ఎకరాల్లో మునిగిపోయాయి. 

11:47 September 03

భరీ వర్షాలకు కడప మొట్నూతల, కనంపల్లె గ్రామాలు అతలాకుతలం

కడప జిల్లా పులివెందుల మండలం మొట్నూతల, కనంపల్లె గ్రామాల్ని వరద నీరు ముంచెత్తింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి... అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓడలపల్లె వద్ద RTD చెరువు తెగిపోయింది. చెరువు నీరంతా పులివెందుల మండలం మొట్నూతలపల్లి గ్రామానికి పోటెత్తింది. గ్రామాల్లోని వందల ఎకరాల అరటి, చీనీ, కూరగాయల పంట నీటిపాలైంది. మొట్నూతల పల్లె గ్రామంలో దాదాపు 20 పశువులు నీటి ఉధృతికి బలై పోయాయని, మూడు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పులివెందులలోని గరాండల్ వంకకు వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. 

11:47 September 03

ఏలూరులో కుండపోత వర్షాలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరులో కుండపోత వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి భారీ వర్షానికి అనేక కాలనీల్లోకి నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ డిపో, కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ఆర్ పేట ప్రధాన కూడళ్లలో మూడు, నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆర్ఆర్ పేట కాలనీలో నీరు నిలవడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షం కావడం వర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నగరంలో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలుస్తోందని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

11:24 September 03

వర్ష బీభత్సం

కృష్ణా జిల్లాలో పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతుంది. చెవిటికల్లు నుంచి కంచికచర్ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చందర్లపాడు మండలం పాటెంపాడు సమీపంలోని గుర్రాల వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలకు నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చందాపురం వద్ద ఉన్న వాగు పొంగిపొర్లుతున్నందున రాకపోకలను నిలిపేశారు. కంచికచర్ల మండలం పరిటాల వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది.

Last Updated : Sep 3, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.