ETV Bharat / city

PRAKASAM BARRAGE: ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తి నీరు విడుదల

ఎగువ నుంచి కృష్ణా నదికి వరద పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.

heavy flow of flood water at  prakasham barrage

author img

By

Published : Aug 2, 2021, 5:54 PM IST

Updated : Aug 2, 2021, 7:47 PM IST

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణా నది ఉగ్రరూపం

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. జలవనరుల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి.. నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిమట్టం 3.07 టీఎంసీలు ఉంచుతూనే.. నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన పంట కాలువలకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ప్రకాశం బ్యారేజ్‌ అధికారులు అన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో ముంపు ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జలవనరులశాఖ ఈఈ రాజ స్వరూప్ అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. 12 స్టాక్ పాయింట్లలో ఇసుక సంచులను ఏర్పాటు చేసినట్లు ఈఈ తెలిపారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు లక్షన్నర క్యూసెక్కులు వస్తున్నాయి.

కృష్ణమ్మ ఉద్ధృతితో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. కృష్ణమ్మ ఉద్ధృతితో ముంపు ప్రాంతాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక ఆవాసం చూపకుండా వెళ్లాలని అధికారులు సూచించారంటున్నారు. ఎక్కడకు వెళ్లి తల దాచుకోవాలో అర్థం కావట్లేదంటున్నారు. కృష్ణలంక, తారకరామనగర్​లోని పలు ఇళ్లకు వరద నీరు చేరడంతో.. పలు వస్తువులతో ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు.

ఇదీ చదవండి:

LOK SABHA: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం

Last Updated : Aug 2, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.