ETV Bharat / city

ప్రమాద ఘంటికలు... ఆవేదనలో అన్నదాతలు - కృష్ణా నది

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎగువనుంచి పెద్దఎత్తున వరద వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శుక్రవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న వరదతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కృష్ణా నదికి వరద ప్రవాహం
author img

By

Published : Aug 16, 2019, 6:06 AM IST

కృష్ణా నదికి వరద ప్రవాహం

కృష్ణా నదికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాతో... 9 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాజిల్లా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం ఉంటుందనే అంచనాతో... కలెక్టర్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపొర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో వరద కొనసాగుతోంది. 11 లంక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పోతర్లంక-దోనేపూడి మధ్య వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పడవులు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద రైతుల పాలిట శాపంగా మారింది. పసుపు, మిరప, కంద, అరటి పంటలు నీట మునిగాయి. నీటమునిగిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గని అత్కూరు, చెవిటికల్లు మున్నలూరు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చందర్లపాడు మండలంలో పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీతీరం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవిన్యూ సిబ్బందిని గ్రామాల వద్ద కాపలా ఉంచారు. వరద తగ్గుముఖం పట్టేవరకూ అప్రమత్తంగా ఉంటామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ...

'ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం... సింహాచలం'

Intro:ap_vzm_37_15_nirasruyula_vasati_gruham_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ఏ విధమైన కుటుంబ ఆసరా లేనివారి పాలిట ఆ వసతి గృహం వరంలా కలిసి వచ్చింది ఫుట్ పాత్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకు నే ఎంతోమంది అభాగ్యులకు నీడగా నిలిచింది

Body:విజయనగరం జిల్లా లో నిరాశ్రయులు వసతి గృహాలు ఏవిధమైన ఆసరా లేనివారికి నీడని ఇస్తున్నాయి పార్వతీపురంలో మెప్మా పురపాలక సంఘం సౌజన్యంతో ఐ ఆర్ పి డబ్ల్యూ ఏ సంస్థ నిరాశ్రయులు వసతిగృహాన్ని ఏర్పాటు చేసింది ఆరు నెలల వ్యవధిలో 35 మంది నిరాశ్రయులకు నీడ కల్పించింది కుటుంబ ఆసరా లేనివారు బయట పనులు చేస్తూ తలదాచుకునే చోటు లేని వారు బిక్షం ఎత్తుకొని జీవించేవారు రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఫుట్ పాత్ ప్రాంతాల్లో నిద్రపోయే వారి కి ఆ వసతిగృహం అక్కున చేర్చుకుంటుంది భోజనం పాటు నిద్రించేందుకు చోటు కల్పిస్తోంది వయసు మీద పడిన వారు అనారోగ్యంతో బాధపడేవారు పూర్తిగా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసింది విచారణకు వెళ్లేవారు కూలీ పనులు చేసేవారు రాత్రి వచ్చి విశ్ర మించేలా ఏర్పాట్లు చేసింది తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ చూపుతుంది వసతి గృహం నిర్వహణకు మేనేజరు ముగ్గురు కేర్ ప్యాకర్లు పని చేస్తున్నారు వీరు పట్నం లో పర్యటించి నిరాశ్రయులను గృహానికి చేర్పించే చర్యలు తీసుకుంటున్నారు విజయనగరం పార్వతీపురం ప్రాంతాల్లో సుమారు వందమంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు దాతల సహకారం తోడవడంతో నిరాశ్రయులకు ఎంతో ఊరట కలుగుతుంది తొలుత ఈ గృహాలను రాత్రి బస కేంద్రాలుగా ప్రారంభించారు బయటకు వెళ్లి తిరిగి వసతి గృహానికి చేరుకోలేని స్థితిలో కొంతమంది ఉన్నారు అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని నిరాశ్రయులు వసతి గృహాలుగా మార్పు చేశారు ఎవరైనా నా నిరాశ్రయులు కూలి పనులు చేసుకుని తలదాచుకునే అవకాశం లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు నిర్వాహకులు కోరుతున్నారు

Conclusion:పార్వతీపురం నిరాశ్రయులు వసతిగృహం అంతా ఒకచోట మాట్లాడుతున్న నిరాశ్రయులు భోజనాలు చేస్తున్న నిరాశ్రయులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.