ETV Bharat / city

జ్వర పీడితులను గుర్తించి..అక్కడికక్కడే మందులు: సింఘాల్

author img

By

Published : May 14, 2021, 9:45 PM IST

కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. రేపటి (శనివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జ్వర పీడితులను గుర్తించి..అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేస్తామన్నారు. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడమే కాకుండా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందన్నారు.

Health Secretary singal on corona
జ్వర పీడితులను గుర్తించి..అక్కడికక్కడే మందులు

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి జ్వర పీడితులను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. జ్వరాలపై ఇంటింటి సర్వే కోసం జిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశామన్నారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేస్తారన్నారు. తద్వారా కరోనా కట్టడి చేయడమే గాక, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని చెప్పారు.

అదనంగా ఆక్సిజన్...

వచ్చే రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలతో పాటు అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందని సింఘాల్ వెల్లడించారు. చెన్నై ప్లాంట్​లో ఇబ్బందులు రావడంతో ఐదారు రోజుల పాటు రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుందని అక్కడి అధికారులు సమాచారమిచ్చారన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించామని సింఘాల్ వివరించారు. పశ్చిమ్​బంగ​లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, జామ్​నగర్ నుంచి 110 మెట్రిక్ టన్నులు, జంషెడ్ పూర్ నుంచి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నట్టు వెల్లడించారు.

డిశ్చార్జ్​ల సంఖ్య పెరుగుతోంది..

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ల సంఖ్య పెరుగుతోందని సింఘాల్ తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 89,087 కరోనా టెస్టులు చేయగా...22,018 పాజిటివ్ కేసులు, 96 మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లు ఉండగా...6,006 రోగులతో నిండాయని తెలిపారు. మరో 447 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 ఆక్సిజన్ బెడ్లకు గానూ.. 22,029 పడకలు కరోనా బాధితులతో నిండిపోయాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. గత 24 గంటల వ్యవధిలో 4,306 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆయన తెలిపారు. 5,523 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరగా...అడ్మిషన్లు, డిశ్చార్జ్​ల మధ్య అంతరం తగ్గుతూ వస్తోందన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జ్​లు మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

అందుబాటులో రెమ్​డిసివర్ ఇంజక్షన్లు...

గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రైవేటు ఆసుపత్రులకు 18,410 రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేసినట్లు సింఘాల్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకే రోజు ప్రైవేటు ఆసుపత్రులకు 18 వేలకు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వటం ఇదే ప్రథమమని వివరించారు. రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. టీకా పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా తీసుకున్న ఏర్పాట్లు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా...రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్ డోస్ గడువు ముగియకముందే వేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 22,018 మందికి కరోనా, 96 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.