ETV Bharat / city

అమరావతికి భూములిచ్చిన రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారు - జీవీఎల్ - GVL on New districts

GVL on Amaravathi: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా 26 జిల్లాల పునర్విభజన చేస్తూ హడావుడిగా గెజిట్ ఇచ్చిందని భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ విమర్శించారు. కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తే.. అక్కడ అనువైన సౌకర్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిని‌ పూర్తిగా నిర్వీర్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయని.. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

GVL on Amaravathi
GVL on Amaravathi
author img

By

Published : Apr 3, 2022, 2:55 PM IST

GVL on Amaravathi: ఒక ప్రణాళిక అన్నది లేకుండా జిల్లాల పునర్విభజన చేస్తూ.. ప్రభుత్వం హడావుడిగా గెజిట్ ఇచ్చిందని భాజపా నేత జి.వి.ఎల్ విమర్శించారు. కలెక్టరేట్లలో అనువైన సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన.. జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని సూచించారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జి.వి.ఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.

అమరావతికి భూములిచ్చిన రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారు -జీవీఎల్

జిల్లాల పునర్విభజనకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ఆమోదం తెలిపిందన్నారు. రెండేళ్లు ఆలస్యంగా చేసినా .. ప్రక్రియను సరైన రీతిలో చేయడం లేదని ఆరోపించారు. అప్పు తెచ్చుకుని పాలన చేసే ప్రభుత్వం కనీసం పాత జిల్లాలకు వంద కోట్లు అయినా ఇవ్వాలని.. కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిలో పెట్టేందుకు 200కోట్లు అత్యవసరంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతిని‌ పూర్తిగా నిర్వీర్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయని.. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిలో భూములు కొన్న వారు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం కూడా తమ సంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉందని తెలిపారు. తాము మౌలిక వసతులు కల్పిస్తామని ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేఖ రాయాలన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని జగన్ ఒక్క లేఖ అయినా కేంద్రానికి రాశారా? అని నిలదీశారు. అమరావతికి అన్యాయం చేయనంటున్న జగన్.. కోర్ట్ లో అఫిడవిట్ ఎందుకు వేశారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు తాను లేఖ రాసినట్లు జి.వి.ఎల్ పేర్కొన్నారు.కేంద్రం 34వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా...,అసత్యాలతో పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కేంద్రం స్పందించి స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. రైతులతో నేరుగా మాట్లాడి.. వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నీరు గార్చేలా జగన్ విధానాలు ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర లో అభివృద్ధికి నోచుకోని నీటి ప్రాజెక్టులను పరిశీలిస్తామని తెలిపారు. ఈనెల 7,8,9 తేదీలలో యాత్ర ద్వారా తెదేపా, వైకాపా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న ప్రాజెక్టు లను ఎందుకు నిర్మించడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు.

ఇదీ చదవండి : ఇంటర్‌ బోర్డులో నిధులు మాయం.. కేసు సీఐడికి అప్పగించే యోచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.