స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత చూసి మాటమార్చుతున్నారని ఆరోపించారు. అవినీతి వాటాలు పక్కనపెట్టి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల్లో వ్యతిరేకత చూసే జగన్ స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేతకాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలపై దాడులను ప్రోత్సహించారని మండిపడ్డారు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ లకూ దౌర్జన్యాలకు అవకాశం ఉండదనే వాయిదా కోరుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా? బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ