లాక్ డౌన్ కు ముందు మత పరమైన కార్యక్రమాల కోసం 43 మంది సభ్యులతో కూడిన జమాత్ బృందం గుజరాత్ నుంచి కడప జిల్లా రాయచోటికి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు లాక్ డౌన్ సమయంలో వారిని రాయచోటిలోని వివిధ మసీదుల్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు. కేంద్రం ఆదేశాల మేరకు గుజరాతీలను రెండు ప్రత్యేక బస్సుల ద్వారా సొంత రాష్ట్రానికి పంపారు.
స్థానిక వైద్యులు 55 ఏళ్ళ వయస్సు పైబడిన వారిని పరీక్షించారు. ఫలితాలు నెగిటివ్ రావడంతో పంపివేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. రాయచోటి నుంచి వెళ్లిన బస్సులు విజయవాడ వరకు వారిని తీసుకెళ్తాయని... అక్కడ నుంచి గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేసిన బస్సుల్లో అహ్మదాబాద్ కు వెళ్తారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: