సుబాబుల్, యూకలిఫ్టస్ సాగు చేసే రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం సంబంధిత వ్యాపారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. సుబాబుల్, యూకలిప్టస్ సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు కటింగ్ ఆర్డర్ జారీ విషయంతో పాటు కనీస మద్దతు ధర కల్పించి తగు న్యాయం చేసే అంశంపై పేపర్ మిల్స్ ప్రతినిధులు, ట్రేడర్స్, రైతుల ప్రతినిధులు, అధికార్లతో మంత్రుల బృందం భేటీ అయ్యింది. రైతులకు మద్దతు ధరతో పాటు లాభదాయకమైన పరిస్థితులు కల్పించేలా చూడాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
దళారులను నియంత్రించి, ట్రేడర్లకు లైసెన్సింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పేపర్ మిల్లుల యాజమాన్యాలు రైతులకు మంచి ధర ఇచ్చేలా ముందుకు రావాలని.... మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి నివేదికను సీఎం జగన్ కు అందజేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: