తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుకల్లో భాగంగా.. ఆలయం బయట ఉన్న గరుత్మంతుడి భారీ విగ్రహానికి అభిషేకం చేయాల్సి ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తున విగ్రహానికి అభిషేకం చాలా శ్రమతో కూడుతున్న పని.
అయితే.. నిర్వాహకులు ఈ సమస్యకు చిన్న ఉపాయంతో వినూత్న పరిష్కారం చూపారు. డ్రోన్ సాయంతో గరుత్మంతుడి విగ్రహానికి అభిషేకం చేశారు. డ్రోన్ కింద ఉన్న బాక్స్‌లో అభిషేక జలాలు నింపి.. స్వామి వారిపై పడేలా అపరేట్ చేశారు. వినూత్నంగా జరిగిన ఈ అభిషేకాన్ని భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పెద్దపెద్ద ఆలయాల్లోనే ఉపయోగించే ఈ డ్రోన్ టెక్నాలజీ ఇలా మండలాలకు చేరింది.
ఇదీ చదవండి: