డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు, అంతకుమించి ఒకేచోట పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ ఉంటుందని స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని లెక్చరర్లకు అదనపు వెయిటేజ్ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇదీ చదవండి