రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడిందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. కరోనాతో ఈనెల 17న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గవర్నర్ కోలుకున్నట్లు తెలిపారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాణాధారాలను కొనసాగిస్తున్నారని, ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని సిసోడియా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: rains in ap: రాష్ట్రంలో వర్షాల ఉగ్రరూపం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం