ETV Bharat / city

GOVERNOR ON RED CROSS: రెడ్​క్రాస్ సేవలు వెలకట్టలేనివి: గవర్నర్ - ap news

GOVERNOR ON RED CROSS: రూ.25 లక్షల నిధులతో వరద బాధితుల సహాయార్థం సామాగ్రితో సిద్ధం చేసిన లారీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రెడ్​క్రాస్ వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు.

రెడ్​క్రాస్ సేవలు వెలకట్టలేనివి: గవర్నర్

author img

By

Published : Dec 25, 2021, 7:39 AM IST

GOVERNOR ON RED CROSS:ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మానవ జీవితంలో అంతర్భాగం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విపత్కర పరిస్థితుల కారణంగా సర్వం కోల్సోయిన వారికి ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందించాలన్నారు. తన విచక్షణాధికారాలతో రెడ్​క్రాస్​కు సమకూర్చిన రూ.25 లక్షలతో వరద బాధితుల సహాయార్ధం సామాగ్రితో సిద్ధం చేసిన లారీలకు గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.

వివిధ సందర్భాలలో రెడ్​క్రాస్ వాలంటీర్లు అందిస్తున్నసేవలు వెలకట్టలేనివని గవర్నర్​ తెలిపారు. కరోనా కష్టకాలం ఇంకా ముగియలేదని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం తప్పనిసరని అన్నారు. తొలి విడతగా వెయ్యి కుటుంబాల కోసం సామాగ్రిని సిద్దం చేయగా, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వీటిని రెడ్ క్రాస్ నేతృత్వంలో పంపిణీ చేయనున్నారని రాజ్​భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా గవర్నర్​కు వివరించారు.

ఒక్కో కుటుంబానికి పదికిలోల బియ్యం, ఒక్కొక్క కిలో కందిపప్పు, పెసరపప్పు, గోధుమపిండి, ఇడ్లీరవ్వ, పంచదార, ఉప్పు, చింతపండు, మిరపపొడి, దుప్పటి తదితర వస్తువులతో కూడిన కిట్​ను అందిస్తున్నామని రెడ్ క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి:

APS RTC Special buses for Sankranti : సంక్రాంతికి 1,266 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.