మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా చర్యలు మొదలుపెట్టింది. 13 జిల్లాల్లో 50 పట్టణాలను అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు తెచ్చింది. ఈనెల 31లోగా ఆయా పట్టణాల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని అధికారులను మున్సిపల్ శాఖ ఆదేశించింది. సమీప గ్రామాలు, ప్రాంతాల విలీనంపైనా సమాచారం కోరింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పట్టణాభివృద్ధి శాఖ జాబితాను పంపింది.
ఇవీ చదవండి..