ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌తో.. సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. సచివాలయాల్లో రెండేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ప్రోబేషన్ ఇవ్వడంపై.. ఉద్యోగుల సంఘాలతో చర్చించనున్నారు. తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. రెండు రోజులుగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రిపై మాకు నమ్మకముంది: అంజన్ రెడ్డి
ప్రభుత్వ అధికారులతో చర్చలపై.. గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షుడు అంజన్ రెడ్డి స్పందించారు. తమకు న్యాయం చేస్తామని.. ప్రొబేషన్ ప్రక్రియ వేగంగా ప్రారంభిస్తామని అజయ్‌జైన్ చెప్పారన్నారు. జూన్‌లోగా ప్రొబేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అజయ్ జైన్ తెలిపారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై తమకు నమ్మకం ఉందన్న అంజన్‌రెడ్డి.. ఉద్యోగులందరూ వెంటనే విధులకు హాజరు కావాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఆందోళన బాటపట్టిన "సచివాలయ" ఉద్యోగులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు