కొవిడ్-19తో వైద్యులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని... ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులకు చికిత్స అందిస్తున్నారని.. ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జయధీర్ అన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఏడుగురు వైద్యులను కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు ఎన్నో లక్షల మందికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేశామన్నారు. మరికొన్ని వేల మందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి...