రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, మీనాక్షి గోస్వామి దంపతులకు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్కు ఆహ్వానించిన గవర్నర్.. తేనీటి విందు ఇచ్చారు. అనంతరం జస్టిస్ గోస్వామికి శాలువా కప్పి, మెమొంటోతో సత్కరించారు. మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో.. మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని గవర్నర్ అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు పొంది.. రాజ్యంగ బద్దమైన సేవ ద్వారా సమాజానికి మంచి చేయాలని ప్రస్తుతించారు.
ఇదీ చదవండి: Swearing ceremony: హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా.. ఈనెల 13న ప్రమాణ స్వీకారం