దళితులను ముఖ్యమంత్రి జగన్ ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకుని వదిలేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేని హైకోర్టు.... వైద్యుడి సుధాకర్ కేసును సీఐడీకి అప్పజెప్పిందన్నారు. అందుకు సంఘీభావంగా తెదేపా ఎస్సీ సెల్ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలు చల్లి పాలభిషేకం చేశారు. ధర్మం ఒక్క పాదం మీద కూడా నడవకుండా చూడాలని చూస్తున్న వాళ్ళని, న్యాయదేవత అడ్డుకుని ధర్మాన్ని కాపాడుతోందని గద్దె అన్నారు.
ఇదీ చదవండి :