ETV Bharat / city

'కమిషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులను గాలికొదిలేశారు'

author img

By

Published : Jun 30, 2021, 8:16 PM IST

రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కక్కుర్తి కోసం పలు ప్రాజెక్ట్ పనులు గాలికి వదిలేశారని మండిపడ్డారు.

devineni-uma
దేవినేని ఉమా

తెలంగాణలో ప్రాజెక్ట్​ల పనులు పరుగులు పెడుతుంటే.. ఆంధ్ర సీఎం జగన్​ ఏం చేస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో మనవాళ్ళు ఉన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇంత పిరికి సీఎంను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు.

రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అఫెక్స్ కౌన్సిల్​లో నీటి వాటాలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కమిషన్​ల కక్కుర్తి కోసం పలు ప్రాజెక్ట్ పనులు గాలికి వదిలేసిన ఘనత జగన్​కే దక్కుతుందన్నారు.

ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి వసంత కృష్ణ ప్రసాద్ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. హత్య కేసులో ఉంటే తెదేపాలో చేర్చుకుని కృష్ణ ప్రసాద్​కు రాజకీయ బిక్ష పెట్టామన్నారు. స్థలాలు విషయంలో ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: WATER DISPUTES: తెలంగాణపై ఏపీ మంత్రిమండలి సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.