ETV Bharat / city

కృష్ణా నదికి పెరుగుతున్న ప్రవాహ ఉద్ధృతి - కృష్ణానది వరద ప్రవాహం

కృష్ణా నదికి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 5.11 లక్షల క్యూసెక్కులు ఉండగా.... ఔట్‌ఫ్లో 5.06 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రాత్రికి వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని అంచనా వేస్తుండగా... కాసేపట్లో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

పెరుగుతున్న కృష్ణానది ప్రవాహ ఉద్ధృతి
పెరుగుతున్న కృష్ణానది ప్రవాహ ఉద్ధృతి
author img

By

Published : Sep 27, 2020, 3:09 PM IST

Updated : Sep 27, 2020, 9:27 PM IST

ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్​తో పాటు ఉపనదుల ప్రవాహం కలుస్తున్న కారణంగా.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకూ ప్రవాహం పెరుగుతుండగా.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి...70 గేట్లును పూర్తిగా తెరిచారు. కృష్ణానదికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత ఇన్ ఫ్లో 5,11,694 క్యూసెక్కులు కాగా...,అవుట్ ఫ్లో 5,06,604 క్యూసెక్కులు.

వరద పరిస్థితిపై జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్‌ టెలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహం క్రమేణా పెరిగి రాత్రికి వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్‌ అధికారులకు తెలిపారు. పెరుగుతున్న వరద దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవాళ రాత్రి 10 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు.

అధికారులకు మంత్రి అనిల్ ఫోన్...

కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్​లతో పాటు అనంతపురం జిల్లా అధికారులతో మంత్రి అనిల్ ఫోన్​లో మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదలశాఖ సీఈలకు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి

కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి దృష్ట్యా... విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు ముంపు ప్రాంత అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. సోమవారం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున...కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

Last Updated : Sep 27, 2020, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.