ETV Bharat / city

సూర్యాపేట జిల్లాలో మరో 5 కరోనా కేసులు - coronavirus death toll in telangana

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో నిన్న రికార్డు స్థాయిలో 16 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా... ఈ రోజు మరో 5 కేసులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ బారిన పడ్డవారి సంఖ్య... 44కు చేరుకుంది. ఈ ఐదుగురు జిల్లా కేంద్రానికి చెందినవారే.

five-coronavirus-positive-case-in-suryapet-district

author img

By

Published : Apr 17, 2020, 4:17 PM IST

తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలోనే 33 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇవాళ వెలుగుచూసిన కేసుల్లో నలుగురు కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందినవారు కాగా... మరొకరు ఇందిరమ్మ కాలనీ వాసిగా అధికారులు గుర్తించారు.

అనుమానితుల నమూనాల్ని పరీక్షలకు పంపుతున్నారు. ఇంకా వంద మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కొవిడ్ కేసులతో... జిల్లా కేంద్రంలో హై అలర్ట్ కొనసాగుతోంది. తిరుమలగిరికి సంబంధించి నిన్న బయటపడ్డ కేసులో... సదరు వ్యక్తితో ప్రాథమిక సంబంధాలు కలిగిన 26 మందిని క్వారంటైన్​కు తరలించారు. తిరుమలగిరిలో ఇది మూడో కేసు కావడంతో... మండల కేంద్రంలో హైపోక్లోరైడ్​తో పిచికారి చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.