రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) పలు జిల్లాల్లో కొందరు.. వరదల్లో చిక్కుకుని గల్లంతై ప్రాణాలు(few people lost their lives in various districts due to heavy rains) కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు, కడప జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు నేడు శెలవు(Holiday to schools) ప్రకటించారు.
కడప జిల్లా రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతయ్యారు. రాజంపేట మండలం రామాపురంలో వరదనీటిలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది.. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలను గుర్తించారు. రాజంపేట వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం నందలూరు వద్ద మూడు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. బస్సుల్లో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
చిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో వరద ప్రవాహంలో నిన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. సుబ్బయ్య(75) అనే వ్యక్తి వాగు దాటే క్రమంలో వరద ప్రవాహానికి వాగులో కొట్టుకుపోయాడు.
అనంతపురం జిల్లా రామగిరి మండలం గంతిమర్రిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిన ఘటనలో రంజిత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతపురం జిల్లా(anantapur district) కదిరి పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు(Two buildings collapsed) కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో మరో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఇంకా ఇద్దరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలినట్లు బాధితులు పేర్కొన్నారు. ఓ భవనం కూలి.. పక్కనున్న మరో భవనంపై పడింది. దీంతో ఆ భవనం కూడా నేలమట్టమైంది. ఓ ఇంట్లో 8 మంది, మరో ఇంట్లో ఉన్న ఏడుగురు(మొత్తం15 మంది) శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇప్పటివరకు 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి.. ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీరంగరాజపురంలో ఓ రైతు మృతి చెందాడు. పొలం వద్ద వరద నీటిలో చిక్కుకున్న బుచ్చయ్య.. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో నీటిలో మునిగిపోయాడు.
ఇదీ చదవండి:
- NELLORE RAINS: గ్రామాలను చుట్టుముట్టిన వరద.. నీట మునిగిన రహదారులు
- TIRUPATI RAINS: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు
- RAINS IN CHITTOOR: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
- CM Jagan Aerial Survey: వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే...కడపకు బయల్దేరిన జగన్
- Buildings collapsed: కదిరిలో విషాదం.. భవనాలు కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు