ETV Bharat / city

Fake Challans: సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం - sub registrar offices

విజయవాడ గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ చలానాలు బయటపడ్డాయి. నేరెళ్ల వెంకట కనక దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తికి సంబంధించిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దాఖలు చేసిన చలానా నకిలీదని తేలింది. 70వేల 300 రూపాయలు విలువ చేసే చలానాను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు. దీనిపై గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fake Challans
Fake Challans
author img

By

Published : Aug 14, 2021, 5:10 AM IST

రాష్ట్రంలో అనేక చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం వెలుగు చూస్తోంది. విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు బయటపడ్డాయి. నేరెళ్ల వెంకట కనక దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రర్ అయిన భూమికి సంబంధించి దాఖలైన చలానా నకిలీదని తేలింది. 70వేల 300 రూపాయలు విలువైన చలానాను గుర్తించిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్.. దీనిపై గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసి సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వద్ద అనధికారికంగా ఉన్న 54 వేల వంద రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఇతర అవకతవకలు కూడా జరిగినట్లు సమాచారం ఉందని... వాటి మీద కూడా విచారణ చేస్తామని అ.ని. శా. అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.