రాష్ట్రంలో 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు జరిగినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు వెల్లడించారు. నకిలీ చలానాల అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగాయన్న ఐజీ... ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ.కోటి రికవరీ చేసినట్లు వివరించారు. మిగతా మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన అవకతవకలపై ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం. మిగతా సబ్‌రిజిస్ట్రార్లపై అంతర్గత విచారణ జరుగుతోంది. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చివేశాం. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌ను రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్నాం.
-శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
ఈ అవకతవకల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లపైనా కేసులు నమోదయ్యాయని ఐజీ శేషగిరిబాబు పేర్కొన్నారు. ఇకనుంచి డాక్యుమెంటు రైటర్లకూ లైసెన్సింగ్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. 25 ఏళ్ల క్రితం ఈ విధానాన్ని మళ్లీ తేవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు శేషగిరిబాబు గుర్తు చేశారు. డాక్యుమెంట్ రైటర్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు చెప్పారు.
ఇవీ చదవండి:
జెండా పండగ రోజు పవన్ 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లింప్స్
Letter: 'మా కుటుంబానికి భద్రత కల్పించండి'.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ