ETV Bharat / city

వెల్లంపల్లి.. దమ్ముంటే కార్పొరేటర్​గా గెలిచి చూపించు: జలీల్​ఖాన్ - కేశినేని శ్వేత వార్తలు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వెల్లంపల్లికి దమ్ముంటే కార్పొరేటర్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

Ex Mla Jalil Khan Election Campaign in Vijayawada
కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం
author img

By

Published : Feb 15, 2021, 9:37 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​.. ఎంపీ కేశినేని నానిపై అవాకులు చవాకులు మాట్లాడటంపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంప్లలికి తానే రాజకీయ భిక్ష పెట్టానని జలీల్ ఖాన్ అన్నారు. మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని.. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్​గా నిలబడి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. వెల్లంపల్లి కార్పొరేటర్​గా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్​ విసిరారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మాట్లాడుతూ... తాను మేయర్ అభ్యర్థిగా గెలవగానే మొదటి సంతకం విజయవాడ నగరంలో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యపై సంతకం పెడతానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కాకినాడ కార్పొరేటర్ హత్య కేసు నిందితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.