మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు వైఖరి అర్థమవుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆయనను ఆసుపత్రిలోనే విచారణ చేయాలని న్యాయస్థానం ఆదేశించినా... అర్ధరాత్రి డిశ్చార్జ్ పేరుతో హైడ్రామా చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.
ఇలానే వ్యవహరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని అమర్నాథ్రెడ్డి హెచ్చరించారు. తెదేపా నాయకులంతా స్వచ్ఛందంగా అరెస్టులకు సిద్ధమైతే ఉన్న జైళ్లు సరిపోవన్నారు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు, డాక్టర్లు వత్తాసు పలకడమేంటని నిలదీశారు.
ఇదీ చదవండి:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు: రఘురామకృష్ణరాజు