ETV Bharat / city

'ఉపాధి హామీ బిల్లులు విడుదలవుతున్నా చెల్లించకపోవడం కోర్టు ధిక్కరణే' - ఎన్​ఆర్​ఈజీఎస్​ నిధులు న్యూస్

కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు విడుదలవుతున్నా జగన్ రెడ్డి(cm jagan) ప్రభుత్వం వాటిని చేసిన పనులకు చెల్లించకుండా పక్కదారి పట్టించటం కోర్టు ధిక్కరణేనని మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని జగన్ రెడ్డి సర్కారు నీరుగార్చిందని విమర్శించారు.

ex minister alapati raja on NREGS funds
ex minister alapati raja on NREGS funds
author img

By

Published : Jul 6, 2021, 2:13 PM IST

ఉపాధి హామీ నిధులు విడుదలవుతున్నా జగన్​రెడ్డి చేసిన పనులకు చెల్లించకుండా పక్కదారి పట్టిస్తోందని ఆలపాటి విమర్శించారు. 'రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని జగన్ రెడ్డి సర్కారు నీరుగార్చింది. గతంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాదాపు రూ.2500 కోట్లు నిధులు విడుదలైనా లబ్ధిదారులకు చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం(govt) వాటిని మళ్లించి రాజద్రోహానికి పాల్పడింది. పాత బకాయిలు తీర్చాలని కేంద్రం, న్యాయస్థానాలు నిధుల విడుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రెండేళ్లుగా నిధులు విడుదల చేయకుండా విజిలెన్స్ విచారణలు, సోషల్ ఆడిటింగ్(social auditing) పేరుతో జాప్యం చేస్తున్నారు. ఒకసారి సోషల్ ఆడిట్ జరిగిన దానికి మళ్లీ విజిలెన్స్ విచారణ(vigilence enquiry) వేసే అధికారం లేదు. విజిలెన్స్ విచారణను 6నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా అసత్యాలు చెప్తూ దురుద్దేశంతో నిధులు చెల్లించకుండా అడ్డుకున్నారు. నిధుల విడుదలైనట్లు కాగితాల్లో చూపిస్తూ ఎక్కడా నిధులు విడుదల చేయకుండా న్యాయవ్యవస్థను, ప్రజల్ని మోసగిస్తున్నారు. రెండేళ్లలో రూ.6వేల కోట్లు ఉపాధి హామీ నిధులొచ్చినా ప్రభుత్వం పనిదినాలకు కల్పించకపోగా ఎక్కడా అభివృద్ధికి వెచ్చించలేదు. ఇళ్ల స్థలాల్లో మెరక వేసేందుకు కూలీల ద్వారా పనులు చేయించకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.' అని ఆలపాటి దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.