NABARD CHAIRMAN : 'దీర్ఘకాలిక ఆస్తులపై రైతులు దృష్టి సారించాలి' - ETV bharat interview with NABARD chairman
రైతులు దీర్ఘకాలిక ఆస్తులు పెంపుదలపై దృష్టి సారించాలని... నాబార్డు ఛైర్మన్ డాక్టరు చింతల గోవిందరాజులు సూచించారు. వ్యవసాయ పంపు సెట్లు, గేదెలు, ఆవులు వంటి వాటిని సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి పొందితే వారికి తక్కువ వడ్డీకి రుణం అందుతుందని చెప్పారు. రాష్ట్రానికి కరోనా సమయంలోనూ నాబార్డు ద్వారా 30 వేల కోట్ల రూపాయలు వరకు రుణ అందించిట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా ఆర్ధికసాయం అందుతోందంటున్న నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.