లాక్‌డౌన్ అమలు, ఎండ వేడి తీవ్రత పెరుగుతున్న తరుణంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే... విరామం లేకుండా విద్యుత్తు ఉపకరణాలు పనిచేస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు మూతపడినప్పటికీ... నివాసాల్లో ఆ మేరకు విద్యుత్తు వాడకం పెరిగింది. ఈ ప్రభావం ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లపై పడుతోంది. స్వీయ నిర్భందంలో ఉంటున్న ప్రజలకు విద్యుత్తు కోతలు లేకుండా సరఫరా సక్రమంగా ఉండేలా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ దృష్ట్యా విద్యుత్తు పంపిణీ సంస్థలు నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి మీటరు రీడింగ్ తీసే ప్రక్రియను ఈ నెలకు వాయిదా వేసుకున్నాయి. సరాసరి విద్యుత్తు బిల్లు మొత్తాన్ని ఆయా వినియోగదారుల చరవాణిలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. డిజిటల్ విధానంలో విద్యుత్తు బిల్లులు చెల్లించాలని కోరుతున్నాయి. రాష్ట్రంలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో తీసుకుంటోన్న చర్యలపై ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ పద్మజనార్ధనరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండీ... త్వరలో ఇంటింటికీ నిత్యావసరాలు: కొడాలి నాని