ETV Bharat / city

తెలుగులో ఇంజినీరింగ్ పాఠాల బోధనకు అనుమతి

author img

By

Published : Jan 26, 2022, 5:53 PM IST

engineering in telugu: రాష్ట్రాల్లో తొలిసారి.. తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్‌ కోర్సు ప్రారంభమైంది. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. మాతృ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతులు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 20 విద్యాసంస్థలు అనుమతులు పొందగా.. తెలుగు మాధ్యమంలో బోధనకు కృష్ణా జిల్లాలోని ఎన్​ఆర్​ఐ కళాశాలకు ఘనత దక్కింది.

తెలుగులో ఇంజినీరింగ్ పాఠాల బోధనకు అనుమతి
తెలుగులో ఇంజినీరింగ్ పాఠాల బోధనకు అనుమతి

ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి- జీఈఆర్ పెంచేందుకు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని నూతన జాతీయ విద్యా విధానం సూచించింది. ప్రస్తుతం 27 శాతంగా ఉన్న జీఈఆర్​ను.. రాబోయే 15ఏళ్లల్లో 50శాతానికి తీసుకెళ్లాలని కేంద్రం నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. బోధన పుస్తకాలను ఏఐసీటీఈ సరఫరా చేస్తుంది. పుస్తకాల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేసి..ఆంగ్లం నుంచి ఏ భాషలోకైనా తర్జుమా చేసుకునే వీలు కల్పించింది.

ఈ విధానం ద్వారా విద్యార్థులను క్రమంగా తెలుగు నుంచి ఆంగ్లం వైపు తీసుకువెళ్తారు. మొదటి ఏడాది మాతృభాష, ఆంగ్లం కలిపి చెప్పడంతో... విద్యార్థుల్లో భయం తొలగి అభ్యసనా సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. మొదటి ఏడాది 75శాతం ఉండే తెలుగు బోధన.. మూడో ఏడాది వచ్చే సరికి 25శాతానికి తగ్గిపోతుంది. నాలుగో ఏడాది పూర్తిగా ఆంగ్లంలోనే బోధిస్తారు. పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లోనూ ఉండగా.. విద్యార్థులు వారికి నచ్చిన భాషలో రాసుకునే అవకాశం ఉంటుంది. తెలుగులో బీటెక్‌ విద్యను అందించేందుకు.. కృష్ణా జిల్లాలోని ఎన్​ఆర్ఐ కళాశాలను ఎంపిక చేసి..కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును ప్రారంభించారు. మాతృభాషలో బోధన ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని అధ్యాపకులు అంటున్నారు.

గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. చివరి ఏడాదికి వచ్చే సరికి ఆంగ్ల భాషపైనా విద్యార్థులు పట్టుసాధిస్తారు. తెలుగులో ఇంజినీరింగ్ పాఠాలు బోధించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: AP Employees Protest: 'చర్చల పేరుతో ఎన్నిసార్లు మోసం చేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.