రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో..దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. ఈనెల 12న సీఎం జగన్ 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' విధానంలో దుర్గమ్మ చరిత్ర తెలుసుకునే విధానం ప్రారంభిస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై రూ. 70 కోట్లతో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని వివరించారు. 'ప్రసాద్' పథకం ద్వారా ఆలయాల అభివృద్ధి, సంరక్షణ కోసం...కేంద్రానికి ప్రతిపాదనలు పంపామంటున్న వాణీమోహన్తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి.