విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా తెదేపా, వైకాపా నేతలు పోటీపడుతూ ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అభ్యర్థి అత్తూలురి ఆదిలక్ష్మీకి మద్దతుగా కొండప్రాంతంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేశారు. త్వరలో మంచినీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న కొండ మెట్లు, డ్రైన్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించి సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా.. పథకాలు రాని వారి ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకుని వారికి సంక్షేమ లబ్ధి చేకూరేలా చేస్తామని వెల్లడించారు.
22వ డివిజన్ కృష్ణలంకలోని స్వర్గపురి రోడ్డు వద్ద నుంచి వైకాపా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17, 18వ డివిజన్లలో సీపీఐ బలపర్చిన తెదేపా అభ్యర్థులు పొలిపల్లి, మైలమూరి పీరుబాబులతో కలిసి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీఐ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి జనసైనికుల విజయమిది: పవన్‌కల్యాణ్