విద్యారంగ పరిరక్షణ అనే అంశంపై విజయవాడలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు హాజరయ్యారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ సిలబస్ వంటి అంశాలపై చర్చించారు. జీవో 77 రద్దు చేయాలని అన్నారు.
ఎయిడెడ్ కళాశాలల్లో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య వంటి ఎంతో మంది గొప్పవారు చదువుకున్నారని గుర్తు చేశారు. ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.