టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) రేపట్నుంచి ఈడీ(ED) విచారణ సాగనుంది. విచారణకు రావాలని ఇప్పటికే పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో సినీ పరిశ్రమకు(FILM INDUSTRY) చెందిన 12 మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపట్నుంచి సెప్టెంబరు 22 వరకు ఈడీ విచారించనుండగా.. దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) రేపు విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను సైతం ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో ఆబ్కారీశాఖ సిట్ 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్.. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించింది. నేరాభియోగ పత్రాల్లో 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన సిట్ చేయలేదు. తాజాగా ఈడీ నోటీసులతో మరోసారి డ్రగ్స్ కేసు చర్చనీయాంశమైంది. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రహదారికి మరమ్మతులు చేయమంటే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు..!