వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్రలో మూడ్రోజులపాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చన్నారు.
విశాఖ జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. రాయలసీమలోనూ తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి: