పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని తెదేపా నేత లింగారెడ్డి డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న విధానాలను పరిశీలించి... ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి పాఠశాలల్లో గతంలో నిర్వహించిన అసెన్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్‌లను అనుసరించి రాష్ట్రంలోని పది విద్యార్థులను పైతరగతికి పంపించాలని సూచించారు. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించినప్పటికీ సిలబస్ విషయంలో, ప్రశ్నల ఎంపికలోనూ గందరగోళం ఏర్పడుతోందని లింగారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'మహమ్మారిపై పోరులో పరస్పర సహకారం'