ETV Bharat / city

DRUGS: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్​ - medchal district news

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్‌
డ్రగ్స్‌
author img

By

Published : Oct 23, 2021, 7:02 PM IST

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్​ రాకెట్​ బయటపడింది. రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి 4.92 కిలోల మెపిడ్రిన్‌తో పాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో పవన్, మహేశ్‌ రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను అరెస్ట్‌ చేయగా ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులకు ఉన్న పక్కా సమాచారంతో హైదరాబాద్​ కూకట్‌పల్లిలో ఉంటున్న పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్‌ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా.. 926 గ్రాముల మెపిడ్రిన్‌ బయటపడింది. మహేశ్‌ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ వాసి అయిన రామకృష్ణగౌడ్ ఇంట్లో సోదాలు చేయగా తన కారులో 4 కిలోల మెపిడ్రిన్ దొరికిందని తెలిపారు. నిందితులను మీడియా ముందు ఎక్సైజ్ పోలీసులు పరిచారు.

కిలోల మాదకద్రవ్యాల స్వాధీనం...

హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ కొరియర్ కార్యాలయంలో ఎన్సీబీ అధికారులు 3కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్శిల్​ను పక్కా సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్​ను విప్పి చూడగా.. చీరల లోపల మాదక ద్రవ్యాల ప్యాకెట్లను ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా చీరల ఫాల్స్​ను కుట్టేశారు. కొరియర్ చేసిన వ్యక్తి వివరాలను పరిశీలించగా.. చెన్నైకు చెందిన వ్యక్తిగా ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. కొరియర్ కార్యాలయంలో సమర్పించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ అధికారులు చెన్నై వెళ్లారు. అక్కడి చిరునామాకు వెళ్లి ఆరా తీయగా.. నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్సీబీ అధికారులు కొరియర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

మరో ముఠా అరెస్ట్​

బెంగళూర్ నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ తీసుకొస్తున్న మరో ముఠాను ఎన్సీబీ అధికారులు దేవనహల్లి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన బెంగళూర్​ ఎన్సీబీ అధికారులు.. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు బెంగళూర్ నుంచి మాదకద్రవ్యాలు తీసుకెళ్లి.. హైదరాబాద్​లోని పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. నిందితుల్లో హైదరాబాద్​కు చెందిన యువకుడితో పాటు ఏపీ, బిహార్​కు చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు.

ఇదీ చదవండి: HARASSMENT: మహిళా పోలీసుకు తప్పని వేధింపులు.. ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.