విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో నిందితుడు అరుణాచలంను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న రామన్ తంగేవి అనే పేరుపై పార్శిల్‌ను పంపినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడని సమాచారం. అరుణాచలంకు చెన్నై బర్మాబజార్‌లో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు పార్శిల్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫిడ్రిన్ అక్రమ రవాణాలో కీలక నిందితుల వివరాలను పోలీసులు కొంత సేకరించారు. అయితే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం చెన్నైకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు.
ఇదీ చదవండి: బాపట్ల జిల్లాలో దారుణం .. గ్రామ వాలంటీర్ దారుణ హత్య