విజయవాడలోని దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నెలరోజులకు సరిపడా ఆహార పదార్థాలను ప్రత్యేక ప్యాకింగ్‌లలో అందజేశారు. స్వామి సచ్చిదానంద దిశా నిర్దేశం మేరకు దత్తపీఠం ప్రతినిధులు ఎఎస్‌ఆర్‌కె ప్రసాద్ పర్యవేక్షణలో సంగీత రంగంలోని కళాకారులకు నిత్యావసర సరకులు సమకూర్చారు. రెండు నెలలుగా శుభకార్యక్రమాలు, వేడుకలు లేకపోవడంతో సంగీత కళాకారులు ఆర్థికంగా చాలా అవస్థులు పడుతున్నారని.. తమకు తోచిన మేరకు వారికి ఆహార కొరత లేకుండా చూసేందుకు సరకులు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
50 ఆక్సిజన్ సిలిండర్ల అందజేత..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి రాక్ మాన్ పరిశ్రమ అధికారులు 50 ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఏరియా ఆస్పత్రిలో పంపిణీ చేశారు. కరోనా నియంత్రణకు సైనికుల వలె పోరాడుతున్న వైద్యులను ఎమ్మెల్యే అభినందించారు. తమ వంతు సహాయంగా రాక్ మెన్ పరిశ్రమ అధికారులు ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడం అభినందనీయమన్నారు.
డాన్సర్లకు రేషన్ పంపిణీ..
కరోనా ప్రభావంతో ఏడాదిన్నరగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నృత్యకళాకారులకు విజయవాడలో డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేషన్ పంపిణి చేశారు. డాన్స్ ను వృత్తిగా చేసుకుని జీవిస్తున్న కళాకారులు కరోనా ప్రభావంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని సంఘం అధ్యక్షులు నాని అన్నారు. ప్రభుత్వం డాన్సర్స్ , డాన్స్ మాస్టర్లను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
ఇదీ చదవండి:
అనాథనంటూ వల.. మూడో పెళ్లి చేసుకుని 6 లక్షలతో ఉడాయించిందిలా..!