ETV Bharat / city

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - donations to cm relief fund news in ap

కరోనా నివారణ సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు.

సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు
సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు
author img

By

Published : Jun 4, 2020, 10:34 PM IST

కరోనా నివారణ సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గ సహకార సంఘాలు, నీటి సంఘాలు, అంగన్వాడీ మహిళలు, నాయకులు రూ.1.10 కోట్లు విరాళాన్ని సీఎం జగన్​కు అందించారు.

  • తాడికొండ ఎమ్యెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గ నాయకులు, అభిమానులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రూ. 25 లక్షలు విరాళం అందజేశారు.
  • కొవిడ్-19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్టణం అల్లిపురంకి చెందిన కల్వరి బాప్టిస్ట్‌ చర్చి రూ. 10లక్షలు, ఏయూ అఫిలియేటెడ్‌ బీఈడీ కాలేజెస్‌ ఆఫ్‌ విశాఖపట్టణం, విజయనగరం జిల్లా తరఫున రూ. 3.65 లక్షలు, ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అసోసియేషన్‌, ఎన్‌బిఎమ్ లా కళాశాల (విశాఖపట్టణం) రూ. 25 వేలు, విశాఖపట్టణం రుషికొండ వుడా హరిత టౌన్‌షిప్‌ రెసిడెంట్స్‌, ఫ్లాట్‌ ఒనర్స్‌ రూ.లక్ష విరాళంగా అందించారు.
  • కొవిడ్​-19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.
  • వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సీఎం సహాయనిధి కింద అందిన చెక్కులు, డీడీలను అందజేశారు.

ఇదీ చూడండి: 'నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.