ETV Bharat / city

Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీలో దీపావళి కార్నివాల్ - Diwali carnival in Ramoji FIlm CIty

అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాలతో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. సందర్శకుల కేరింతలతో భూతల స్వర్గాన్ని తలపించే రామోజీ ఫిల్మ్‌సిటీ కోలాహలంగా మారింది. కరోనాతో కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన ప్రజలు సరికొత్త అనుభూతులతో ఆనందడోలికల్లో మునిగిపోయారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూనే ఆద్యంతం సంతోషాల హరివిల్లును ఆస్వాదించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీ
రామోజీ ఫిల్మ్‌సిటీ
author img

By

Published : Nov 1, 2021, 11:43 AM IST

రామోజీ ఫిల్మ్‌సిటీ

ప్రపంచ ప్రఖ్యాత రామోజీఫిల్మ్ సిటీని చూసి సందర్శకులు మైమరిచిపోయారు. సుందర కట్టడాలు, అద్భుత దృశ్యాల నడుమ వినోదాల విందును మోసుకొస్తూ... దీపావళి కార్నివాల్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. కొవిడ్ ప్రత్యేక మార్గదర్శకాలను అమలుచేస్తూ పర్యాటకుల భద్రతపై చిత్రనగరి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆనంద లోకాల్లో సందర్శకులు..

సాయంసంధ్యవేళ మదిని ఉల్లాసపరిచే సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. నృత్య బృందాలు పంచే వినోదానికి తోడు వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించారు. విద్యుద్దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ ఆనందలోకాల్లో విహరించారు.

అందమైన ప్రపంచం.. రామోజీ ప్రాంగణం..

ఫిల్మ్‌సిటీలోని ప్లే జోన్లు, వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను చూసి ఫిదా అయిపోయారు. రామోజీ ఫిల్మ్‌సిటీ అందమైన ప్రపంచాన్ని తలపిస్తోందంటూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఆర్​ఎఫ్​సీలో దీపావళి కార్నివాల్..

వచ్చిన ప్రతీసారి ఫిల్మ్‌సిటీలో మరెన్నో చూడదగ్గ ప్రదేశాలతో పాటు కొత్త వినోద కార్యక్రమాలు అలరిస్తున్నాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు . రోజంతా తిరిగినా తనివి తీరలేదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులను కనువిందు చేసే దీపావళి కార్నివాల్‌ సంబురాలు ఈనెల 14 వరకు సాగనున్నాయి.

ఇదీ చదవండి : FORMATION DAY WISHES : 'ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.