ETV Bharat / city

తెలంగాణ: చిన్ని బొజ్జకు ‘ధాత్రి మిల్క్' రక్ష! - Dhatri Milk bank available at niloufer hospital latest news

గుక్కపెట్టి ఏడ్చే పసివాడి బాధ తల్లికి తప్ప ఎవరికీ తెలియదు. ప్రేమగా దగ్గరకు తీసుకొని పాలు పడితే ఏడుపు ఆపేసి అమ్మ కళ్లలోకి ముసిముసిగా చూస్తాడు. చాలామంది పసికందులకు వివిధ పరిస్థితుల వల్ల అమ్మపాలు దొరకని పరిస్థితి. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి‌లో చికిత్స పొందుతున్న అటువంటి శిశువులకు ఆ లోటును తీరుస్తోంది అక్కడే ఉన్న ‘ధాత్రి మిల్క్‌ బ్యాంకు’.

dhatri-milk-use-for-childrens
చిన్ని బొజ్జకు ‘ధాత్రి మిల్క్' రక్ష
author img

By

Published : May 1, 2020, 5:37 PM IST

తక్కువ బరువు, నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు నిలోఫర్‌లోని నియోనాటిల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఎన్‌ఐసీయూ)లో చికిత్స పొందుతుంటారు. కొందరు ఇక్కడే జన్మించినవారు కాగా జిల్లా, మండల కేంద్రాల నుంచి మరికొందరిని తీసుకొస్తుంటారు. కొంతమంది గర్భిణుల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల వల్ల నెలలు నిండకముందే కాన్పులు జరుగుతుంటాయి.

కేజీ కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లలను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షించాలి. ఒక్కోసారి నెల, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాలి. శిశువులతో తల్లులు అన్ని రోజులు ఆసుపత్రి బెడ్‌పై ఉండటం సాధ్యం కాదు. ఇంకొందరు తల్లుల్లో వివిధ కారణాలతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే శిశువులకు నిలోఫర్‌లోని మిల్క్‌ బ్యాంకు నుంచి పాలు అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే తల్లిపాలను మించింది లేదు.

నిత్యం 6-10 మంది పిల్లలకు..

ఎన్‌ఐసీయూలో 150 మంది వరకు శిశువులు చికిత్స పొందుతుంటారు. ఇందులో తల్లులకు దూరంగా ఉన్నవారికి ధాత్రి మిల్క్‌ బ్యాంకు అమ్మగా మారుతోంది. నిత్యం 6 నుంచి 10 మంది పిల్లలకు అందిస్తున్నారు. రోజూ అరలీటరు వరకు అవసరమవుతాయి. గత డిసెంబరు, జనవరి నెలల్లో స్వచ్ఛందంగా ఇచ్చిన తల్లుల నుంచి 90 లీటర్ల వరకు పాలను సేకరించి భద్రపరిచామని, ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో ఇవి చాలా ఉపయోగపడుతున్నాయని ధాత్రి మిల్క్‌ బ్యాంకు డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ తెలిపారు.

కరోనా నేపథ్యంలో మార్చి మొదలుకొని తల్లుల నుంచి పాల సేకరణ ఆపేశామన్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు మరో 45 రోజుల వరకు సరిపోతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే చిన్నారులకు అత్యవసరంగా తల్లిపాలు అవసరమైతే నిలోఫర్‌లోని మిల్క్‌ బ్యాంకును సంప్రదించాలని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.