రాష్ట్ర సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్స్‌ను (SPO) తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వారు ఈనెల 31 వరకు విధుల్లో కొనసాగుతారని.., ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,156 మంది ఉద్యోగస్తులు ఎస్పీవోలుగా పనిచేస్తున్నారు. కర్నూలు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరులతోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం, ఇసుక, గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు 2020 ఫిబ్రవరిలో తాత్కలిక పద్ధతిలో వీరిని నియమించారు. అయితే గత కొన్ని నెలలుగా తమకు వేతనం ఇవ్వటంలేదని సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిని తొలగించటం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: తనపై నమోదైన కేసు కొట్టేయాలని.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్