ETV Bharat / city

కష్ట కాలంలో భక్తుల కడుపు నింపిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం - భక్తుకలకు సేవలందించిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం

వారణాసి హిందువులకు పరమ పవిత్ర క్షేత్రం. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు విశ్వేశ్వరుణ్ని దర్శించుకుంటారు. కాశీ గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. కానీ ఒక్కసారిగా విధించిన కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు. కాశీలోనే చిక్కుకుపోయిన వేలాది మంది భక్తులకు సేవలందించిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం దేవాలయాలు తెరుచుకున్న తర్వాత కూడా మళ్లీ తన సేవలను ప్రారంభించింది.

కష్ట కాలంలో భక్తుల కడుపు నింపిన ఆశ్రమం
కష్ట కాలంలో భక్తుల కడుపు నింపిన ఆశ్రమం
author img

By

Published : Sep 18, 2020, 8:44 PM IST

కరోనా లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా జనజీవనం స్తంభించింది. ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. అలాగే నిత్యం రద్దీగా ఉండే కాశీలో వేలాదిమంది భక్తులు ఉండిపోయారు. వారందరికి లాక్‌డౌన్‌ సమయంలో శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం వారు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేసింది. తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించింది.

కష్ట కాలంలో భక్తుల కడుపు నింపిన ఆశ్రమం

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి. మళ్లీ కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. వారందరికి శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం వారు కరోనా నిబంధనలతో సేవలందిస్తున్నారు. అందులో భాగంగా ఆశ్రమానికి ప్రధాన ద్వారం దగ్గర శానిటైజేషన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేసింది. ఆశ్రమం మొత్తం రోజుకి రెండుసార్లు రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. భోజనాలు ఏర్పాటు చేసే దగ్గర రెండు గజాల దూరం పాటించేలా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నారు. రూమ్‌లు ఖాళీ అయిన తర్వాత క్రమం తప్పకుండా శానిటైజేషన్‌ చేస్తున్నారు.

కరోనా దృష్ట్యా యాత్రికులు తగిన జాగ్రత్తలతో కాశీ క్షేత్రానికి రావాల్సిందిగా ఆశ్రమం తరపున నిర్వాహకులు కోరుతున్నారు.

ఇదీచదవండి

కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.