విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని భక్తులు తరలివచ్చారు. వీఐపీ మార్గం నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు వందలాదిగా వచ్చిన భక్తులు యత్నించారు. పోలీసుల బారికేడ్లను తోసుకుని ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో భక్తుల ప్రవేశం, నిష్క్రమణకు ఒకే మార్గం ఉండటంతో దేవాలయ పరిసరాలు అమ్మవారి భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగారు.
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..
విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మధ్యాహ్నం పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన సీఎం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం అమ్మవారికి చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు, అధికారులు..ప్రత్యేక దర్శన ఏర్పాటుచేశారు. పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని ఉన్నారు.
ఇదీ చదవండి