ETV Bharat / city

'రైతులను మరింత కుంగదీసేలా ప్రభుత్వ నిర్ణయం' - Devineni Uma

కృష్ణా వరదల కారణంగా రూ.95 కోట్ల ఆర్థిక నష్టం జరిగితే... ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.37 కోట్లు ఇస్తామని ప్రకటించడం ఏంటని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి... రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Aug 28, 2019, 7:32 PM IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కృష్ణా వరదల ప్రభావంతో రాష్ట్రంలో 90 మండలాలు, 484 గ్రామాల్లో రైతులు భారీగా నష్టపోయారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వరదలతో రూ.95 కోట్ల ఆర్థిక నష్టం జరిగితే... ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.37 కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణమని విమర్శించారు. రైతులు, వరద ముంపు బారిన పడిన ప్రజల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రైతులను మరింత కుంగదీసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలు వేసిన రైతులకు వేల కోట్లలో నష్టం జరిగితే... కేవలం రూ.228కోట్లు నష్టం జరిగినట్లు నివేదిక ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ నష్టం వాటిల్లిందన్న దేవినేని... నష్టపరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ...వైకాపా విధానాలు గందరగోళం... ఆందోళనలో ప్రజలు

Intro:చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి మండలంలో గల బాలయోగి గురుకుల పాఠశాలలో ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి నాగార్జున మరియు మాజీ kimidi ఎమ్మెల్యే గారు

Body:చీపురుపల్లి నియోజకవర్గంలో గల చీపురుపల్లి మండలంలో బాలయోగి గురుకుల ప్రెసిడెన్సీ లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్

Conclusion:ఓటింగ్ పై ఆసక్తి చూపిస్తున్న ఓటర్లు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.