Devineni Uma on Polavaram Project: రాష్ట్రానికి ఊపిరి లాంటి పోలవరం ప్రాజెక్టును 33 నెలల నుంచి వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71 శాతం పనులు పూర్తి చేసుకున్న పోలవరం ప్రాజెక్టును రాజకీయ కక్షతోనే అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దేవినేని ఉమా జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో కేసుల విషయంలో జగన్ రాజీ కుదుర్చుకుని రాష్ట్ర భవిష్యత్ ని అగమ్యగోచరంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మల్ ప్రాజెక్టులను గాలికి వదిలేయడం వలనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకుంటుందని దేవినేని ఉమా మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారో మీడియా ముఖం సీఎం జగన్ చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : TDP district committee meeting : అమరావతినే కాదు రాష్ట్రాన్నే శ్మశానంగా మార్చారు -తెదేపా