డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ సుధాకర్... ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారన్నారు. డాక్టర్ల సేవలు మెచ్చుకుని.. పూల వర్షం కురిపిస్తుంటే, ఏపీలో మాత్రం చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం లాంటి హేయమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో సస్పెన్షన్కు గురైన డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం కక్ష కట్టిందని దేవినేని ఉమా ఆరోపించారు. దళితుల పట్ల జగన్ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఉమా అన్నారు.
ఇదీ చదవండి: వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు