ETV Bharat / city

రైతు దినోత్సవం కాదు.. రైతు సొమ్ము దుబారా దినోత్సవం: దేవినేని - రైతు దినోత్సవంపై దేవినేని ఉమ వ్యాఖ్యల వార్తలు

వైకాపా ప్రభుత్వం.. రైతు దినోత్సవం కాదు రైతు సొమ్ము దుబారా దినోత్సవం జరుపుకోవాలని మాజీమంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఏం ఉద్ధరించారన్న ఉమ.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

devineni uma fires on ycp government farmers day celebrations
దేవినేని ఉమ, మాజీమంత్రి
author img

By

Published : Jul 8, 2020, 7:10 PM IST

వైకాపా ప్రభుత్వం ఏం ఉద్ధరించిందని రైతు దినోత్సవం చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో కంటే బయటి మార్కెట్​లోనే మంచి విత్తనాలు తక్కువ ధరకు దొరుకుతున్నాయన్నారు. పసుపు కొనుగోళ్లు సీఎంవో కార్యాలయ సిఫార్సులతో జరుగుతున్నాయని ఆరోపించారు.

ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ఉమ నిలదీశారు. రైతు దినోత్సవం కాదు రైతు సొమ్ము దుబారా దినోత్సవం జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్​రెడ్డి హయాంలో14 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే.. ఆయన జన్మదినం రోజున రైతు దినోత్సవ జరపడం ఏంటని మండిపడ్డారు.

ఇవీ చదవండి...

రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు.. తప్పుబట్టిన ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.