ETV Bharat / city

'అబద్ధాలు చెప్పేందుకే బుగ్గన హడావుడిగా వచ్చారు'

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడం మానేసి... గత ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అబద్ధాలు చెప్పేందుకు హడావుడిగా వచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కనుసన్నల్లో పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Oct 11, 2019, 11:09 PM IST

దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా... నిన్నటి వరకు కనిపించని ఆర్థికమంత్రి... అబద్ధాలు చెప్పేందుకే హడావుడిగా వచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురదజల్లడం తప్ప... బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డికి మరొకటి చేతకాదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం అంటూ తమపై ఆరోపణలు చేయడం తప్ప... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు మాత్రం లేవని ఎద్దేవా చేశారు.

రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు వైకాపా నేతలు అక్రమంగా మద్యం అమ్ముకుంటున్నారని దేవినేని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటన కోసం జగన్ పడిగాపులు సీబీఐ గురించేనని దుయ్యబట్టారు. తెదేపా నేతలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా... కార్యకర్తలు చెక్కుచెదరరని దేవినేని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఆర్టీసీ విలీనంపై విధివిధానాలు ఖరారు.. ఉత్తర్వులు జారీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.