ETV Bharat / city

'నిర్వాసితులను గాలికి వదిలారు.. వైఎస్ విగ్రహం పెడతామంటున్నారు' - పోలవరం తాజా వార్తలు

వరదలతో ఇబ్బందులు పడిన ప్రజలకు కనీసం మంచి నీళ్ల ప్యాకెట్ కూడా ఇవ్వని వైకాపా ప్రభుత్వం...పోలవరం వద్ద వైఎస్ విగ్రహం పెడుతామంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రూ.254 కోట్లతో పోలవరం ప్రాజెక్టు వద్ద 125 అడుగుల వైఎస్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఉమా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులను గాలికి వదిలేసి...విగ్రహం పెట్టేందుకు సిద్ధం అయ్యారని ఆక్షేపించారు. మంత్రి పదవులు నిలుపుకునేందుకు ప్రతిపక్షాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

devineni-uma
devineni-uma
author img

By

Published : Nov 18, 2020, 6:58 PM IST

Updated : Nov 19, 2020, 3:16 PM IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు పనులు పర్యవేక్షణ కోసమే మంత్రి అనిల్​ కుమార్​ను సీఎం జగన్ పోలవరం పంపారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రూ.254 కోట్లతో పోలవరంలో 125 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ ఆరోపించారు. వరదల్లో మునిగిన ప్రజలకు మంచినీళ్ల ప్యాకెట్​ కూడా ఇవ్వని ప్రభుత్వం, పోలవరం వద్ద వైఎస్ విగ్రహం పెడతామంటోందని విమర్శించారు. నిర్వాసితులను గాలికి వదిలేసి విగ్రహం పెట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు.

అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పోలవరంలో సాధించిన ప్రగతి వై.ఎస్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవటమే అని దేవినేని ఉమా అన్నారు. నీటి నిలువ సామర్థ్యాన్ని 150 అడుగులుగా ఉంచడం ముఖ్యమో, 125 అడుగుల వై.ఎస్ విగ్రహం ముఖ్యమో జగన్ సమాధానం డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రూ.11,537 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయంపై ప్రధానిని అడిగే ధైర్యం జగన్​కు లేవన్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ భాష అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని దేవినేని ఉమా హితవు పలికారు.

రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించండి

జగనన్న సర్వేరాళ్ల పథకం పేరుతో రూ.600 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం, రైతుల సొంత భూముల్లో జగన్ ఫొటోలు ముద్రించిన రాళ్లను పాతడం ఏమిటని మాజీమంత్రి దేవినేని అసహనం వ్యక్తంచేశారు. లక్షా 30 వేల కోట్ల రూపాయలు అప్పులుచేసింది చాలక, ల్యాండ్ , శాండ్, మైనింగ్ , లిక్కర్ ఇలా ఏదీ వదలకుండా దోపిడీ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని ఎస్​ఈసీపై ఆరోపణలు మాని, రైతులకు చెల్లించాల్సిన ధాన్యం నగదు రూ.197 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా తమ అమాత్య పదవులను రెన్యువల్ చేసుకోవడానికే ప్రతిపక్షాలను, రాజ్యాంగ పదవుల్లోని వారిని దూషిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ అభ్యంతరాలపై స్పందించండి...ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

Last Updated : Nov 19, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.